చౌడాలమ్మ ప్రతిష్టకు ఎమ్మెల్యే కవ్వంపల్లికి ఆహ్వానం

756చూసినవారు
చౌడాలమ్మ ప్రతిష్టకు ఎమ్మెల్యే కవ్వంపల్లికి ఆహ్వానం
రాజన్న సిరిసిల్ల జిల్లా మానకొండూర్ నియోజకవర్గం ఇల్లంతకుంట మండలం వెల్జీపురం గ్రామంలో గురువారం, జరగనున్న శ్రీ చౌడాలమ్మ ప్రతిష్ట కార్యక్రమానికి మానకొండూరు ఎమ్మెల్యే డా. కవ్వంపల్లి సత్యనారాయణను వెల్జీపురం యాదవ సంఘం సభ్యులు ఆహ్వానించారు. ఈ ఆహ్వాన కార్యక్రమంలో సర్పంచ్ నాయిని నవీన్ కుమార్, AMC డైరెక్టర్ కంకణాల రాంప్రసాద్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు గొల్ల కమిటీ శంకర్ యాదవ్, సీనియర్ నాయకులు చిలువేరు స్వామి రెడ్డి, యాదవ సంఘం అధ్యక్షులు నరిగే శ్రీనివాస్ యాదవ్, ఉపాధ్యక్షులు సలేంద్రి ఆనంద్ యాదవ్, మరియు సంఘం సభ్యులు జక్కుల శ్రీనివాస్ యాదవ్, జుర్ర రాజయ్య యాదవ్, జుర్ర చంద్రయ్య యాదవ్, జక్కుల సంతోష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.