ముకర్రంపుర బాలికల పాఠశాలకు ఆకతాయిల బెడద.. పోలీసులకు ఫిర్యాదు

4చూసినవారు
ముకర్రంపుర బాలికల పాఠశాలకు ఆకతాయిల బెడద.. పోలీసులకు ఫిర్యాదు
కరీంనగర్ లో ముకర్రంపుర ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో రాత్రివేళ గుర్తుతెలియని ఆకతాయిలు హల్ చల్ చేస్తున్న ఘటన వెలుగులోకి వచ్చింది. పాఠశాల తలుపులు, తాళాలు ధ్వంసం చేయడంతో పాటు, కొత్తగా ఏర్పాటు చేసిన తాళాలను సైతం పగులగొడుతున్నట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు తెలిపారు. అంతేకాకుండా ఉపాధ్యాయులను భయపెట్టేలా బెదిరింపు రాతలు రాస్తున్నట్లు వెల్లడించారు. విషయం తెలుసుకున్న స్థానిక ప్రజాప్రతినిధి పాఠశాలను స్వయంగా సందర్శించి పరిస్థితిని పరిశీలించారు. అనంతరం వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ సీఐకి ఫిర్యాదు చేసి, పాఠశాల పరిసరాల్లో రాత్రివేళ ప్రత్యేక గస్తీ ఏర్పాటు చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్