మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు

709చూసినవారు
మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు
కరీంనగర్ 11వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి ఆకుల నర్మదా-నర్సన్న, డివిజన్ లోని పలు కాలనీల్లో ప్రచారం నిర్వహిస్తూ, తమకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరుతున్నారు. ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి, తమ డివిజన్ అభివృద్ధి చెందాలంటే ఆకుల నర్మదా-నర్సన్న కార్పొరేటర్‌గా గెలవాలని పూర్తి మద్దతు ప్రకటిస్తున్నారు. డివిజన్ సమస్యలపై అవగాహన ఉన్న తమకు అవకాశం ఇస్తే, కరీంనగర్ లోనే 11వ డివిజన్‌ను అభివృద్ధిలో అగ్రగామిగా నిలుపుతానని నర్మదా-నర్సన్న తెలిపారు. గతంలో కార్పొరేటర్‌గా ఉన్నప్పుడు డ్రైనేజీలు, రోడ్లు, పార్కులు, ఓపెన్ జిమ్‌ల నిర్మాణం వంటి పలు సమస్యల పరిష్కారానికి కృషి చేశామని ఆమె పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్