కరీంనగర్ రెవెన్యూ డివిజన్ అధికారిగా నల్లా వెంకట్ రెడ్డి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో భూ సర్వే స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌గా పనిచేసిన ఆయనను ప్రభుత్వం ఈ పదవిలో నియమించింది. రిటైర్ అయిన ఆర్డీవో మహేశ్వర్ స్థానంలో వెంకట్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. రెవెన్యూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని నూతన ఆర్డీవో వెంకట్ రెడ్డి తెలిపారు.