బోయినపల్లి మండల
కాంగ్రెస్ నూతన అధ్యక్షుడు కొమ్మనబోయిన సువీన్ యాదవ్ శుక్రవారం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. విప్ ఆది శ్రీనివాస్, సువీన్ యాదవ్‌ను శాలువాతో సత్కరించి, పార్టీని బలోపేతం చేయాలని, ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. సువీన్ యాదవ్ కుటుంబం పార్టీకి చేసిన సేవలను ఆయన ప్రశంసించారు. ఈ సమావేశంలో సర్పంచ్ ఉయ్యాల శ్రీనివాస్, ఇతర నాయకులు కూడా పాల్గొన్నారు.