కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా న్యూ ఇయర్ వేడుకలు అంబరాన్నంటాయి. జిల్లా ప్రజలు పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ నూతన సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలికారు. అర్ధరాత్రి 12 గంటలకు కేక్ కట్ చేసి, బాణసంచా కాల్చి, ఒకరికొకరు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటూ సందడి చేశారు. యువత డీజే స్టెప్పులతో నూతన సంవత్సరానికి వెల్కమ్ చెప్పారు. పోలీసుల తనిఖీల కారణంగా రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి.