తెలంగాణ క్రీడా పాఠశాలల్లో 2026-27 విద్యా సంవత్సరానికి 4వ తరగతి ప్రవేశాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. కరీంనగర్ జిల్లా క్రీడాధికారి శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం, 01-09-2017 నుండి 31-08-2018 మధ్య జన్మించిన విద్యార్థులు మార్చి 4లోగా tgss.telangana.gov.in లో దరఖాస్తు చేసుకోవాలి. మార్చి 13 నుంచి మండల, 28 నుంచి జిల్లా, ఏప్రిల్ 27 నుంచి రాష్ట్రస్థాయి ఎంపికలు జరుగుతాయి. మరిన్ని వివరాలకు 9704061725 నంబర్‌లో సంప్రదించవచ్చు.