రాజన్న సిరిసిల్ల జిల్లా, మానకొండూర్ నియోజకవర్గం, ఇల్లంతకుంట మండలం కందికట్కూరు గ్రామంలోని విద్యుత్ వినియోగదారులకు వేసవిలో అంతరాయం లేకుండా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని ఏన్. పి. డి. సి. ల్. సూపరింటెండింగ్ ఇంజనీర్ T.వేణుమాధవ్ ఆదేశించారు. సోమవారం, 27/04/2026న ఆయన 33 కే.వి కందికట్కూరు సబస్టేషన్ ను సందర్శించి, సిబ్బందితో లోటుపాట్లను సమీక్షించారు. వినియోగదారులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని సూచించారు. ఈ పర్యటనలో డివిజనల్ ఇంజనీర్ N. అంజయ్య, ADE గోపినాథ్, ఏ.ఈ నాగేష్ తదితరులు పాల్గొన్నారు.