ప్రధానమంత్రి నరేంద్ర
మోదీ 12 ఏళ్ల సేవా స్ఫూర్తితో, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆదేశాల మేరకు బోయినపల్లి మండలం తడగొండ గ్రామంలో 'మన బడి మన బాధ్యత' కార్యక్రమం నిర్వహించారు. స్థానిక
బీజేపీ నాయకులు, కార్యకర్తలు ప్రభుత్వ పాఠశాల ఆవరణను, తరగతి గదులను చీపుర్లతో ఊడ్చి, నీళ్లతో కడిగి శుభ్రం చేశారు. పిల్లలకు మెరుగైన వాతావరణం కల్పించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టామని నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సింగరి వెంకటేష్, మిల్కుల శ్రీనివాస్, గుడి రవీందర్ రెడ్డి, చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.