వినాయక మండపాలను సందర్శించిన పాడిఉదయ్ నందన్ రెడ్డి

0చూసినవారు
వినాయక మండపాలను సందర్శించిన పాడిఉదయ్ నందన్ రెడ్డి
కరీంనగర్ జిల్లా, వీణవంక మండలంలో ఆదివారం వినాయక నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగాయి. YuppTV, Turito ఫౌండర్ & CEO పాడి ఉదయ్ నందన్ రెడ్డి మండలంలోని 10 వినాయక మండపాలతో పాటు పలు గ్రామాల్లోని మండపాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మండపాల నిర్వాహకులు ఆయనను శాలువాతో ఘనంగా సన్మానించారు. ఉత్సవాల్లో యువత చొరవను ఉదయ్ నందన్ రెడ్డి అభినందించారు. ఈ కార్యక్రమంలో వీణవంక మాజీ జడ్పిటిసి దాసారపు ప్రభాకర్, యువత తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్