షరతులు లేకుండా డబ్బులు చెల్లించాలి

1చూసినవారు
బోయినపల్లి మండల కేంద్రంలోని సహరా గ్రూప్ కంపెనీలో డబ్బులు డిపాజిట్ చేసిన బాధితులకు ప్రభుత్వం ఎలాంటి షరతులు లేకుండా వెంటనే నగదు అందించాలని సీపీఎం డిమాండ్ చేసింది. సీపీఎం మండల కన్వీనర్ శ్రీధర్ మాట్లాడుతూ, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏడాదిలోపు డబ్బులు చెల్లించాల్సి ఉన్నప్పటికీ, కేంద్ర ప్రభుత్వం అనేక నిబంధనలు, షరతులు పెడుతూ బాధితులను ఇబ్బందులకు గురిచేస్తోందని విమర్శించారు.

సంబంధిత పోస్ట్