అధికారుల నిర్లక్ష్యంతో ప్రజలకు గోస.. కలుషిత నీరు తాగుతున్న

0చూసినవారు
అధికారుల నిర్లక్ష్యంతో ప్రజలకు గోస.. కలుషిత నీరు తాగుతున్న
వర్షాల కారణంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో తాగునీరు కలుషితమై ప్రజలు వ్యాధుల బారిన పడే ప్రమాదం నెలకొంది. గతంలో ప్రభుత్వం సరఫరా చేసిన క్లోరోస్కోప్ కిట్లు గ్రామ పంచాయతీల్లో నిరుపయోగంగా పడి ఉన్నాయి. అధికారుల పర్యవేక్షణ లోపంతో చాలా కిట్లలోని రసాయనాలు గడువు ముగిసిపోయాయి, మరికొన్ని గ్రామాల్లో వాటి జాడే లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీ, RWS, ఆరోగ్య శాఖల మధ్య సమన్వయ లోపం వల్ల నీటి నాణ్యతా పరీక్షలు నిలిచిపోయాయి. కలుషిత నీటితో డయేరియా, కామెర్లు వంటి వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

సంబంధిత పోస్ట్