ఇల్లంతకుంటలో ఘనంగా పోచమ్మ, మహంకాళమ్మ బోనాలు

951చూసినవారు
ఇల్లంతకుంటలో ఘనంగా పోచమ్మ, మహంకాళమ్మ బోనాలు
రాజన్న సిరిసిల్ల జిల్లా మానకొండూర్ నియోజకవర్గం ఇల్లంతకుంట మండలం అనంతారం గ్రామంలో ఆదివారం గ్రామ కాపు సంఘం ఆధ్వర్యంలో గ్రామ దేవతలు పోచమ్మ, మహంకాళమ్మ బోనాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. డప్పు చప్పుళ్లు, శివశక్తుల పూనకాలతో ఘనంగా బోనాలు తీసి నైవేద్యం సమర్పించారు. వర్షాలు సమృద్ధిగా కురిసి గ్రామం పాడి పంటలు, పశు సంపదలతో కళకళలాడాలని కుల బంధువులు కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు చల్ల సరోజన నారాయణ, బొల్లం రేణుక వెంకటేశం, మున్నూరు కాపు సీనియర్ నాయకులు, గ్రామ కుల బంధువులు, మహిళలు, యువకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్