గంగాధర మండలం మధురానగర్ గ్రామంలోని ఓ ఇంట్లో పేకాట ఆడుతున్న ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. 29/04/2026 సాయంత్రం 4 గంటలకు అందిన సమాచారంతో ఎస్సై వంశీకృష్ణ సిబ్బందితో కలిసి రైడ్ నిర్వహించారు. అరెస్ట్ అయిన వారిలో మంగపేటకు చెందిన మల్యాల కొమురయ్య, మహమ్మద్ జాకీర్ హుస్సేన్, బైరీ కార్తీక్ రెడ్డి, మల్యాల నర్సయ్య, మధురానగర్‌కు చెందిన కుంచాల ఏడుకొండలు, ముద్రకోల తిరుపతి ఉన్నారు. వారి వద్ద నుంచి పేకాట ముక్కలు, ₹15,590 నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.