జిల్లా పరిధిలో పోలీస్ యాక్ట్ అమలు: జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే

6చూసినవారు
జిల్లా పరిధిలో పోలీస్ యాక్ట్ అమలు: జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే
శాంతి భద్రతల పరిరక్షణ కోసం ఏప్రిల్ 1 నుండి 30వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా పోలీసు యాక్ట్ 1861 అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ తెలిపారు. దీని ప్రకారం, పోలీసుల అనుమతి లేకుండా ఎలాంటి ధర్నాలు, రాస్తా రోకోలు, నిరసనలు, ర్యాలీలు, బహిరంగ సభలు, సమావేశాలు నిర్వహించరాదని, నిబంధనలకు విరుద్ధంగా డి.జే. వినియోగించరాదని సూచించారు. శాంతిభద్రతలకు భంగం కలిగించే లేదా ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించే చట్ట వ్యతిరేక కార్యక్రమాలను చేపట్టవద్దని హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్