పెట్టుబడుల పేరుతో సుమారు రూ.7 కోట్ల మేర మోసానికి పాల్పడి, గతంలో అరెస్టయిన ములుగురి సురేష్‌ను పోలీసులు శుక్రవారం రిమాండ్‌లోకి తీసుకుని విచారించారు. ఈ కేసులో దాదాపు 110 మంది బాధితులు ఉన్నట్లు తెలుస్తోంది. ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన కీలక ఆధారాలను పోలీసులు సేకరించారు. విచారణ అనంతరం టూటౌన్ పోలీసులు నిందితుడిని కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం ఆదేశాల మేరకు అతన్ని తిరిగి జైలుకు తరలించారు.