విద్యుత్ మరమ్మతులు, చెట్ల కొమ్మల తొలగింపు పనుల కారణంగా కరీంనగర్ టౌన్-1 పరిధిలోని చంద హాస్పిటల్,
బీజేపీ కార్యాలయం, కెమిస్ట్రీ భవన్, శివ థియేటర్, వెంకటేశ్వర టెంపుల్ ప్రాంతాల్లో సోమవారం ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు టౌన్-1 ఏఈ పంజాల శ్రీనివాస్ తెలిపారు. ఈ అంతరాయానికి వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.