కరీంనగర్ పట్టణంలో పలు ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం

0చూసినవారు
కరీంనగర్ పట్టణంలో పలు ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం
విద్యుత్ మరమ్మతుల నేపథ్యంలో శ్రీపురం కాలనీ, సిటిజన్ కాలనీ, క్రిష్ణనగర్, ఆటో నగర్, బైపాస్ రోడ్ లలో సోమవారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోనుంది. అలాగే, సప్తగిరికాలనీ, ప్రగతినగర్, టెలిఫోన్ క్వార్టర్స్, శివనగర్, బతుకమ్మకాలనీ, మార్కెండేయకాలనీలలో ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, సీతారాంపూర్, జగిత్యాల రోడ్, సాయి బాలాజీ నగర్, ఆర్టీసీ కాలనీలలో ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ అంతరాయం ఏర్పడనుంది. ఈ మేరకు అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్