కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి తెలిపిన వివరాల ప్రకారం, ప్రజల సమస్యల సత్వర పరిష్కారం కోసం జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో ప్రజావాణి కార్యక్రమం సోమవారం నుంచి యథావిధిగా కొనసాగనుంది. స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.