కరీంనగర్ జిల్లా ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘం (GTA) నూతన అధ్యక్షుడిగా గాజుల రవీందర్, ప్రధాన కార్యదర్శిగా చంద్రశేఖర్ రెడ్డి ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, సర్వీస్ రూల్స్ ఏర్పాటులో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొంటామని తెలిపారు. భవిష్యత్తులో సంఘం నిర్వహించే కార్యక్రమాలకు ప్రతి ఉపాధ్యాయుడు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా, మండల బాధ్యులు పాల్గొన్నారు.