ప్రభుత్వ భవనాల నిర్మాణానికి రూ. 29. 25 కోట్లు మంజూరు

430చూసినవారు
ప్రభుత్వ భవనాల నిర్మాణానికి రూ. 29. 25 కోట్లు మంజూరు
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 3 ఆర్డీవో, 10 తహసీల్దార్ కార్యాలయాల నిర్మాణానికి ప్రభుత్వం రూ. 29.25 కోట్లు మంజూరు చేసింది. ఒక్కో భవనానికి రూ. 2.25 కోట్ల చొప్పున నిధులు కేటాయించినట్లు అధికారులు తెలిపారు. జగిత్యాల, మెట్‌పల్లి, మంథని, వేములవాడ, సిరిసిల్లలో ఆర్డీవో ఆఫీసులు, గన్నేరువరం, ఇల్లందకుంట, ఎండపల్లి, భీమారం, సాలూరా, పాలకుర్తి, కమాన్‌పూర్, తంగళ్లపల్లి, రుద్రంగి, వీర్నపల్లి, వేములవాడలో నూతన తహసీల్దార్ కార్యాలయాలు నిర్మించనున్నారు. ఈ భవనాల నిర్మాణంతో పాలనాపరంగా ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందనున్నాయి.

సంబంధిత పోస్ట్