గంగాధర మండలం ఇస్లాంపూర్, కోట్ల నరసింహులపల్లి, గర్షకుర్తి గ్రామాల్లో రూ. 20 లక్షలతో నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఇస్లాంపూర్, మల్లాపూర్, వెంకంపల్లి, మధురానగర్, చర్లపల్లి(ఎన్), బూరుగుపల్లి, కోట్ల నరసింహులపల్లి, గర్శకుర్తి, కురిక్యాల, గట్టుభూత్కూర్ గ్రామాల్లో రూ. 10 లక్షలతో నిర్మిస్తున్న స్వశక్తి సంఘం భవనాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. గర్శకుర్తిలో రూ. 10 లక్షలు, వెంకంపల్లిలో రూ. 5 లక్షలతో నిర్మించిన సిసి రోడ్లను కూడా ఆయన ప్రారంభించారు.