జూన్‌లో సదరం శిబిరాలు: సిరిసిల్ల జీజీహెచ్

22చూసినవారు
జూన్‌లో సదరం శిబిరాలు: సిరిసిల్ల జీజీహెచ్
రాజన్న సిరిసిల్ల ప్రభుత్వ జనరల్ హాస్పిటల్‌లో జూన్ 2026 నెలలో దివ్యాంగుల కోసం సదరం శిబిరాలు నిర్వహించనున్నారు. ఆర్థో, వినికిడి, మానసిక, కంటిచూపు, జనరల్ విభాగాల వారీగా జూన్ 1, 4, 5, 8, 9, 15, 16, 18 తేదీలలో ఈ క్యాంపులు జరుగుతాయి. దివ్యాంగులు UDID ఫామ్, ఆధార్, మెడికల్ డాక్యుమెంట్లు, ఎక్స్-రే, ఫోటోతో ఉదయం 9 గంటలకు హాజరు కావాలని సూచించారు. పూర్తి వివరాల కోసం ఆసుపత్రిని సంప్రదించవచ్చు.

సంబంధిత పోస్ట్