తడగొండలో 30 ఏళ్లు సేవలందించిన పారిశుద్ధ కార్మికుడికి సన్మానం

0చూసినవారు
తడగొండలో 30 ఏళ్లు సేవలందించిన పారిశుద్ధ కార్మికుడికి సన్మానం
బోయినపల్లి మండలం తడగొండ గ్రామ పంచాయతీలో 30 ఏళ్లుగా పారిశుద్ధ్య కార్మికుడిగా విశిష్ట సేవలందించి పదవీ విరమణ పొందిన కట్ట దుర్గయ్యను అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో బుర్ర కనకయ్య ఘనంగా సన్మానించారు. దుర్గయ్యకు శాలువా కప్పి, చిరు సన్మానం చేశారు. మూడు దశాబ్దాలుగా గ్రామ పరిశుభ్రతకు అంకితమైన దుర్గయ్య సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు, యువకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్