కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం బొమ్మకల్ గ్రామంలో ఉపాధి హామీ కూలీలకు గ్రామ సర్పంచ్ వేముల శ్రీకాంత్, పంచాయతీ కార్యదర్శి కలిసి గురువారం మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు. వేసవిలో ఎండలు తీవ్రంగా ఉన్నందున పని తొందరగా ముగించుకొని ఇండ్లకు వెళ్లాలని, నీటి సౌకర్యం ఏర్పాటు చేయాలని ఫీల్డ్ అసిస్టెంట్ కు సర్పంచ్ సూచించారు. కూలీలు దీనిపై హర్షం వ్యక్తం చేశారు.