ఉపాధి హామీ పనులను సర్పంచ్ ప్రారంభించారు

791చూసినవారు
ఉపాధి హామీ పనులను సర్పంచ్ ప్రారంభించారు
రాజన్న సిరిసిల్ల జిల్లా మానకొండూర్ నియోజకవర్గం ఇల్లంతకుంట మండలం అనంతారం గ్రామంలో గురువారం రోజున (30/04/2026) ఉపాధి హామీ పథకంలో భాగంగా కాలువ పూడిక తీత పనులను గ్రామ సర్పంచ్ వొల్లాల రజిత వెంకటేశం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కదం జయంత్ కుమార్, వార్డు సభ్యులు చిట్టి విజయ, చొప్పరి సాయిలు, బట్టి క్రాంతి, ఫీల్డ్ అసిస్టెంట్ సత్యనారాయణ, గ్రామ పెద్దలు, ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు.