శాతవాహన విశ్వవిద్యాలయ పరిధిలోని వివిధ కోర్సులకు పరీక్షల తేదీలను ఖరారు చేసినట్లు పరీక్షల నియంత్రణ అధికారి తెలిపారు. ఎం. ఫార్మసీ రెండవ సెమిస్టర్ పరీక్షలు అక్టోబర్ 7 నుంచి 15 వరకు, బి ఫార్మసీ 2 వ సెమిస్టర్ పరీక్షలు అక్టోబర్ 6 నుంచి 18 వరకు, 4 సెమిస్టర్ పరీక్షలు అక్టోబర్ 7 నుంచి 17 వరకు, ఎం. ఏడ్ 2 సెమిస్టర్ పరీక్షలు అక్టోబర్ 6 నుంచి 18 వరకు జరుగుతాయని, ఈ పరీక్షలన్నీ ప్రతిరోజూ మధ్యాహ్నం రెండు గంటల నుండి 5 గంటల వరకు నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు. విద్యార్థులు పరీక్షలకు సన్నద్ధం కావాలని సూచించారు.