హుజూరాబాద్ పట్టణంలోని శ్రీ భవాని శంకర మహదేవాలయంలో రేపటి నుంచి అక్టోబర్ 2 వరకు అమ్మవారి శరన్నవరాత్రులు జరుగనున్నాయి. ఆలయ అర్చకులు శ్రీ విశ్వనాథ శర్మ తెలిపిన వివరాల ప్రకారం, ప్రతిరోజూ చతుషష్టోపచార పూజ, చండీ హవనం, సువాసిని పూజలు నిర్వహించబడతాయి. మధ్యాహ్నం అన్నప్రసాద వితరణ ఉంటుంది. 29న కాళరాత్రి హోమము, అక్టోబర్ 1న మహాపూర్ణాహుతి, అక్టోబర్ 2న విజయదశమి, అమ్మవారి శోభాయాత్రతో ఉత్సవాలు ముగియనున్నాయి. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి అమ్మవారిని దర్శించుకోవాలని కోరారు.