బోయినపల్లి మండలం విలాసాగర్ గ్రామ సర్పంచ్ ఏనుగుల కనుకయ్య, గ్రామ పంచాయతీ పాలకవర్గం ఇటీవల విడుదలైన SSC పబ్లిక్ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను అభినందించారు. హారిక 558 మార్కులతో మొదటి స్థానం, మహాలక్ష్మి 539 మార్కులతో రెండవ స్థానం సాధించారు. చదువుతో పాటు ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో రాణించి పాఠశాలకు, గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని సర్పంచ్ విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు బొలుగం శ్రీనివాస్, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.