రాజన్న సిరిసిల్ల జిల్లాలో పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. జిల్లా సాంఘిక సంక్షేమ గురుకుల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. మొత్తం 504 మంది విద్యార్థులు పరీక్ష రాయగా, 501 మంది ఉత్తీర్ణులయ్యారు. 7 పాఠశాలల్లో 5 పాఠశాలలు 100% ఉత్తీర్ణత సాధించాయి. జిల్లా సగటు ఉత్తీర్ణత శాతం 99.4%. 88 మంది విద్యార్థులు 90% పైగా మార్కులు సాధించి సత్తా చాటారు. ఇల్లంతకుంట పాఠశాల విద్యార్థులు మందడి హసీ (586), బి. రుచిత (580), బాపురపు ఇందన (579) అత్యధిక మార్కులు సాధించగా, చిన్నబోనాల పాఠశాల నుంచి గంగుల మధుమిత (575), బోయిన్‌పల్లి పాఠశాల నుంచి మాచర్ల ఉమేష్ చంద్ర (575) మార్కులు సాధించారు.