వర్షపు నీటి నిల్వ సమస్యకు సర్పంచ్ చొరవతో పరిష్కారం

12చూసినవారు
వర్షపు నీటి నిల్వ సమస్యకు సర్పంచ్ చొరవతో పరిష్కారం
రాజన్న సిరిసిల్ల జిల్లా మానకొండూర్ నియోజకవర్గం ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్ గ్రామంలో బుధవారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లే ప్రధాన రహదారి వద్ద వర్షపు నీరు నిల్వ ఉండటంతో స్థానికులు సర్పంచ్ గన్నేరం వసంత నర్సయ్య దృష్టికి తీసుకెళ్లారు. సర్పంచ్ వెంటనే జేసీబీ సహాయంతో కాలువ తీయించి, నీటిని పొలాలకు మళ్లించి, నీరు నిల్వకుండా చర్యలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్, జీపీవో, వార్డు సభ్యులు, యూత్ సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్