జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు బోయినపల్లి మండలంలోని వెంకటరావుపల్లి, బోయినపల్లి గ్రామాల్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ డ్రైవ్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్న 15 మందిని గుర్తించి వారిపై కేసులు నమోదు చేసినట్లు ఎస్సై రమాకాంత్ తెలిపారు. రహదారి ప్రమాదాల నివారణకు ఇలాంటి తనిఖీలు కొనసాగుతాయని, వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. ఈ స్పెషల్ డ్రైవ్‌లో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.