
ఖతార్, కువైట్‌పై క్షిపణి దాడి
పశ్చిమాసియాలో ఉద్రికత్తలు రోజురోజుకు తీవ్రంగా మారుతున్నాయి. తాజాగా ఖతార్‌లోని దోహాకు సమీపంలో ఓ ట్యాంకర్‌పై గుర్తుతెలియని క్షిపణి దాడి చేసింది. ఈ మేరకు యూకే సముద్ర వ్యవహారాల అథారిటీ వివరాలు వెల్లడించింది. పోర్టు పక్కన నిలిచిఉన్న ఇంధన ట్యాంకర్‌పై జరిగిన దాడి కారణంగా నౌక ఎడమ వైపు భాగం దెబ్బతింది. దీని వల్ల చమురు లీకేజీకి, పర్యావరణానికి ఎలాంటి నష్టం కలగలేదని అథారిటీ పేర్కొంది.




