కరీంనగర్ మానేరు రివర్ ఫ్రంట్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ చిత్రా మిశ్రా అధికారులను ఆదేశించారు. ఇరిగేషన్, టూరిజం, రెవెన్యూ శాఖలు సమన్వయంతో పనిచేసి భూసేకరణ ప్రక్రియను ముగించాలని ఆమె సూచించారు. పెండింగ్ పనులను సత్వరమే పూర్తి చేసి, ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టును ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కలెక్టర్ స్పష్టం చేశారు.