కరీంనగర్ తెలంగాణ చౌక్ వద్ద ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థుల సమస్యల పరిష్కారం కోరుతూ రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఏబీవీపీ జిల్లా కన్వీనర్ విష్ణు మాట్లాడుతూ, తెలంగాణలో విద్యాశాఖ మంత్రిని నియమించకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమని, విద్యార్థులకు రావలసిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. దిష్టిబొమ్మ దహనం సందర్భంగా పోలీసులకు, ఏబీవీపీ నాయకులకు మధ్య తోపులాట జరిగింది.