కరీంనగర్‌లో ఆహార పదార్థాల కల్తీపై ఫుడ్ సేఫ్టీ అధికారులు కఠిన చర్యలు చేపట్టారు. నాణ్యత పాటించని 12 మంది వ్యాపారులపై జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి రూ.4 లక్షల వరకు జరిమానా విధించారు. మరో 8 కేసుల విచారణ కోర్టులో కొనసాగుతోంది. ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీసే కల్తీలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని, తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని ఫుడ్ ఇన్స్‌పెక్టర్ రోహిత్ రెడ్డి తెలిపారు.