బోయినపల్లిలో తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ, జిల్లా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో ఉచిత వేసవి శిక్షణ శిబిరం ప్రారంభమైంది. మండల సర్పంచ్ నల్ల మోహన్ శిబిరాన్ని ప్రారంభించి,
విద్యార్థులు, యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఆటలో మెలకువలు నేర్చుకుని జిల్లా, రాష్ట్ర స్థాయిలో రాణించి గ్రామానికి పేరు తేవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ మెరుపుల చందన-జలంధర్, వార్డు సభ్యుడు బొజ్జ నరేష్, యువమిత్ర యూత్ క్లబ్ అధ్యక్షుడు చౌదరి శ్రీధర్, కోచ్ సంతోష్,
విద్యార్థులు పాల్గొన్నారు.