అన్నదాతను ఆదుకోమంటే అక్రమ అరెస్టులా: మాజీ ఎమ్మెల్యే రవిశంకర్

2చూసినవారు
చొప్పదండిలో జీపీఎస్, ఆన్‌లైన్ ట్రక్ షీట్ విధానాలను వెంటనే రద్దు చేసి, ఆంక్షలు లేకుండా వడ్లు కొనాలని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ డిమాండ్ చేశారు. ఈ విధానాల వల్ల ట్రాక్టర్‌కు రూ. 4 వేల భారం పడుతోందని, కాంగ్రెస్ నిర్లక్ష్యంతో రైతులకు అపార నష్టం జరిగిందని ఆయన విమర్శించారు. ధాన్యం లిఫ్టింగ్ సమస్యలపై రైతులు, బీఆర్ఎస్ నేతలతో కలిసి ఎన్టీఆర్ విగ్రహం వద్ద ధర్నా చేపట్టినందుకు పోలీసులు వారిని అరెస్టు చేశారు.

ట్యాగ్స్ :