జూనియర్ కళాశాలలో ప్రతిభావంతులైన విద్యార్థులకు ఘన సన్మానం

8చూసినవారు
జూనియర్ కళాశాలలో ప్రతిభావంతులైన విద్యార్థులకు ఘన సన్మానం
కరీంనగర్ జిల్లా, జమ్మికుంట జూనియర్ కళాశాలలో ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో విద్యారంగంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను గుర్తించి బుధవారం శాలువాలతో సత్కరించి అభినందనలు తెలిపారు. ప్రిన్సిపల్ కుమార్ మాట్లాడుతూ, విద్యార్థులు క్రమశిక్షణ, పట్టుదల, సేవాభావంతో ముందుకు సాగాలని, విద్యతో పాటు సామాజిక బాధ్యతను అలవర్చుకోవాలని సూచించారు. ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహించడం ద్వారా ఇతర విద్యార్థులలోనూ పోటీతత్వం పెరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, అధ్యాపకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్