శాతవాహన యూనివర్సిటీలో ఉద్రిక్తత!

1372చూసినవారు
శాతవాహన యూనివర్సిటీలో ఉద్రిక్తత!
కరీంనగర్ శాతవాహన విశ్వవిద్యాలయంలో నేరచరిత్ర కలిగిన బోటనీ లెక్చరర్ శ్రీనివాస్‌ను వెంటనే తొలగించాలని విద్యార్థులు ఆందోళన చేపట్టారు. జైలుశిక్ష అనుభవించిన వ్యక్తిని విధుల్లోకి తీసుకోవడంపై విద్యార్థులు మండిపడుతున్నారు. విద్యార్థులు లేకున్నా గోడలకు పాఠాలు చెబుతున్నారని ఆరోపిస్తూ ప్లకార్డులతో నిరసన తెలిపారు. వీసీ స్పందించి లెక్చరర్‌పై చర్యలు తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్