బోయినపల్లి మండల కేంద్రంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో సోమవారం విలేకరుల సమావేశం జరిగింది. జూలై 1న జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించనున్నట్లు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గురిజాల శ్రీధర్ తెలిపారు. వ్యవసాయ కూలీలకు చట్టబద్ధమైన కనీస వేతనాలు అమలు చేయాలని, ఉపాధి హామీ పథకాన్ని పాత విధానంలోనే కొనసాగించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ ధర్నాను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.