హుస్నాబాద్‌ను కరీంనగర్‌లో కలపడం తథ్యం: మంత్రి పొన్నం

7చూసినవారు
హుస్నాబాద్‌ను బలవంతంగా సిద్దిపేట జిల్లాలో కలిపారని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. 'ఇక్కడి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా గతంలో పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో హుస్నాబాద్‌ను కరీంనగర్‌లో కలుపుతామని సీఎం రేవంత్ ప్రకటించారు. స్థానిక శాసన సభ్యుడిగా ఈ అంశాన్ని సీఎం దృష్టికి తీసుకుని వెళ్లాం. శాస్త్రీయ పద్ధతిలో జిల్లాల మార్పులు చేర్పులు జరిగితే కరీంనగర్‌లో కలపడం తథ్యం' అని అన్నారు.

సంబంధిత పోస్ట్