మాజీ ప్రధాని స్వర్గీయ శ్రీమతి ఇందిరా గాంధీ 41వ వర్ధంతి సందర్భంగా కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సుడా ఛైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఆయన ఇందిరా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం నగరంలోని ఇందిరా గాంధీ విగ్రహానికి కూడా ఆయన నివాళులర్పించారు. దేశాభివృద్ధి కోసం పాటుపడిన గొప్ప వ్యక్తి ఇందిరా గాంధీ అని ఈ సందర్భంగా సుడా ఛైర్మన్ కొనియాడారు.