కరీంనగర్ జిల్లా రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన 'కరీంనగర్ టైగర్' ముద్దసాని దామోదర్ రెడ్డి, మామిడాలపల్లి గ్రామానికి చెందినవారు. ఆయన 29 ఏళ్లకే ఎమ్మెల్యేగా, 30 ఏళ్లకే మంత్రిగా ప్రజలకు సేవలు అందించారు. 2012 ఏప్రిల్ 9న అనారోగ్యంతో మరణించినా, ఆయన వేసిన అభివృద్ధి పునాదులు నేటికీ నిలిచి ఉన్నాయి. ఆయన ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు.