కరీంనగర్ హౌసింగ్ బోర్డు కాలనీ సమీపంలో బుధవారం పాఠశాల బస్సు ఢీకొని ఏడేళ్ల బాలిక వాత్సవి మృతి చెందింది. గాయత్రి నగర్లోని బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి వస్తున్న వాత్సవి, ఆమె స్నేహితురాలు రోడ్డు దాటుతుండగా అతివేగంగా, అజాగ్రత్తగా వచ్చిన పాఠశాల బస్సు వారిని ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్ర గాయాలైన వాత్సవి కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.