కరీంనగర్‌లో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు అరెస్ట్

2చూసినవారు
కరీంనగర్‌లో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు అరెస్ట్
కరీంనగర్ జిల్లా కొత్తపల్లి పరిధిలో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. కొత్తపల్లి సీఐ కోటేశ్వర్ తెలిపిన వివరాల ప్రకారం, రేకుర్తికి చెందిన మహమ్మద్ మున్నా, మహమ్మద్ షారూక్ నాగపూర్‌లో కిలోకు 20 వేల రూపాయల చొప్పున 2.2 కిలోల గంజాయిని కొనుగోలు చేశారు. రేకుర్తి సమ్మక్క గద్దెల సమీపంలో ప్యాకెట్లుగా చేసి విక్రయిస్తుండగా ఎస్‌ఐ సాంబమూర్తి మరియు ఆయన సిబ్బంది నిందితులను పట్టుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్