కరీంనగర్ రూరల్ మండలం నగురూరు జూబ్లీ నగర్ దారిలో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. సుల్తానాబాద్ మండలం సాంబయ్య పల్లికి చెందిన కొమ్మిడి దేవేందర్ రెడ్డి (60), చామనపల్లికి చెందిన దూడెం రఘురాం (33) మరణించారు. దేవేందర్ రెడ్డి భార్య హైమావతి, చామనపల్లికి చెందిన రమేష్ (20) తీవ్ర గాయాలపాలయ్యారు. ఇద్దరు వ్యక్తులు ద్విచక్ర వాహనాలపై వస్తుండగా ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో రోడ్డుపై పడిన నలుగురిపై వెనుక వస్తున్న లారీ దూసుకుపోవడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. గాయపడిన వారిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు.