కరీంనగర్ వాల్మీకినగర్లో మద్యానికి బానిసై అనారోగ్యంతో టైలర్ మాడిశెట్టి శ్యామ్ (47) ఆత్మహత్య చేసుకున్నాడు. మంగళవారం రాత్రి ఇంట్లో ఉరేసుకుని ఆయన మరణించారు. రెండేళ్లుగా మద్యానికి బానిసై పని చేయకుండా భార్య వద్ద డబ్బులు తీసుకుని తాగేవాడని, దీంతో అనారోగ్యానికి గురయ్యాడని సీఐ రామచందర్రావు తెలిపారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.