భార్య మృతితో తట్టుకోలేక భర్త కూడా.. కన్నీళ్లు పెట్టిస్తున్న కరీంనగర్ ఘటన

2933చూసినవారు
భార్య మృతితో తట్టుకోలేక భర్త కూడా.. కన్నీళ్లు పెట్టిస్తున్న కరీంనగర్ ఘటన
కరీంనగర్‌ భగత్‌నగర్‌కు చెందిన 97 ఏళ్ల స్వర్ణకారుడు గొట్టిముక్కుల వెంకటాచారి, అనారోగ్యంతో బాధపడుతున్న తన 85 ఏళ్ల భార్య ఆగమ్మ బుధవారం రాత్రి మృతి చెందడంతో తీవ్ర మనోవేదనకు గురై, గురువారం తెల్లవారుజామున ఆయన కూడా మరణించారు. గంటల వ్యవధిలోనే దంపతులిద్దరూ మృతి చెందడం, వారి మృతదేహాలను పక్కపక్కనే ఉంచి నివాళులర్పించడం కుటుంబ సభ్యులను, ఆత్మీయులను కంటతడి పెట్టించింది. గురువారం సాయంత్రం కరీంనగర్‌లో వారి దహన సంస్కారాలు జరిగాయి.