ఒమన్ లో మోసపోయిన రవీందర్ కు కేంద్ర మంత్రి అండ

16చూసినవారు
ఒమన్ లో మోసపోయిన రవీందర్ కు కేంద్ర మంత్రి అండ
కరీంనగర్ గోపాలపూర్ కు చెందిన ఆరెల్లి రవీందర్, జీవనోపాధి కోసం నాలుగు నెలల క్రితం ఒమన్ వెళ్ళాడు. అక్కడ ఒక కంపెనీలో ఉద్యోగం చేస్తూ, పని చేయించుకొని జీతం ఇవ్వకుండా మోసం చేశారని బాధితుని భార్య కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ను ఆశ్రయించారు. తన భర్త వేరే కంపెనీలో పనిచేస్తున్నాడని, అందుకు వ్యతిరేకంగా కంపెనీ 500 ఒమన్ రియాల్స్ జరిమానా విధించిందని ఆమె తెలిపారు. వెంటనే స్పందించిన మంత్రి, ఇండియన్ ఎంబసీకి ఆదేశాలు జారీ చేయడంతో, రవీందర్ బుధవారం స్వదేశానికి చేరుకోనున్నాడు. రవీందర్ కుటుంబ సభ్యులు మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్